BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 11 June 2026, 07:33 pm
Posted by : V శ్రీనివాస్

​అమృత్ 2.0 పనులను వేగవంతం చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jun, 2026 - 07:33 PM
312 వీక్షణలు

​నాణ్యతా ప్రమాణాలతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం 

బెల్లంపల్లిలో పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎమ్మెల్యే గడ్డం వినోద్

ఇంటింటికి నిరంతరం సురక్షితమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్‌తో కలిసి బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న అమృత్ 2.0 పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా, నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. పనుల కారణంగా స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

​ఈ పరిశీలనలో భాగంగా ప్రజారోగ్య శాఖ ఈఈ, డీఈఈలతో అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి పనుల పురోగతిని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి అవసరమైన యంత్రాంగం, సిబ్బందిని సమకూర్చుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో ఎక్కడా రాజీ పడవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, ప్రజారోగ్య శాఖ మరియు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు