BREAKING
thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మంచి మాట
Date of Publish : 28 October 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్నాబ్ తుఫాన్‌తో రైతులకు నష్టం..నేతలకు ప్రచార కష్టాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Oct, 2026 - 07:42 PM
15 వీక్షణలు


ఆర్నాబ్ తుఫాన్‌తో రైతులకు నష్టం.. నేతలకు ప్రచార కష్టాలు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలి గ్రామాల వారీగా పంట నష్టం అంచనా వేయాలి అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ డిమాండ్ విస్సన్నపేట: ఆర్నాబ్ తుఫాన్ రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగల్చగా, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి రాజకీయ నేతలకు ఆటంకంగా మారిందని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం మందగించిందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సైతం రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్నాబ్ తుఫాన్ కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం ఉన్నప్పటికీ, పంట నష్టం మాత్రం తీవ్రస్థాయిలో ఉందని తెలిపారు. రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి, పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ బీభత్సానికి పంటలు నీట మునగడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుండగా, తుఫాన్ రూపంలో మరో విపత్తు రైతులపై పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామాల వారీగా పంట నష్టం సర్వే నిర్వహించాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తుఫాన్ కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ఉచిత రేషన్ అందించి ఆదుకోవాలని కోరారు. 81,350 హెక్టార్లలో పంట నష్టం అంచనా ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 81,350 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోందని హరినాథ్ తెలిపారు. ఇందులో 70,900 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైనట్లు, మరో 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు నివేదికలు అందినట్లు పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలన జరిపితే నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పంటలు నీట మునగడం, నేలకొరిగిపోవడం, దిగుబడిపై ప్రభావం పడటం వంటి పరిణామాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసే సమయంలో కేవలం ప్రాథమిక నివేదికలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలోనూ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోనసీమలో తీవ్ర నష్టం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందని హరినాథ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న ఇళ్లలో అధిక శాతం ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు తెలిపారు. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోనూ వరి పంట ముంపునకు గురైందన్నారు. తుఫాన్ ప్రభావంతో సుమారు 220 చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం ఉందని, అనకాపల్లి జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు.