BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 06:46 pm
Posted by : కూనురు మధు

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ బి. చంద్రశేఖర్

తెలంగాణ
/ నల్గొండ
09 Nov, 2026 - 06:46 PM
10 వీక్షణలు

NTODAY NEWS :  నల్లగొండ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, వచ్చే వారంలోగా కనీసం 75 శాతం ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 301 ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా, వచ్చే వారంలో కనీసం 200 ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. 30 రోజులు దాటిన 149 ఫిర్యాదులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 85 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించగా, రెవెన్యూ శాఖకు సంబంధించి 39, ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో సంక్షేమ వసతి గృహాల్లో టాయిలెట్ల పరిశుభ్రత, భోజన నాణ్యత, పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా విద్యార్థులందరికీ ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాన నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వి.బి.జి. రాంజీ పథకం కింద మంజూరైన పనులన్నింటినీ వెంటనే ప్రారంభించాలని, చేయూత పెన్షన్ల పంపిణీలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అనర్హులకు పెన్షన్లు మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. ఈ నెల 12న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో గిరిజన సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పత్రికల్లో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి, సంబంధిత వివరణతో పాటు తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.