BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 01:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏ కొండూరు మండలంలో విషాదం....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 01:26 PM
128 వీక్షణలు

ఏ కొండూరు మండలంలో విషాదం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలో పడి వాహనదారుడు మృతి

ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కుమ్మరికుంట్ల వద్ద ఘటన

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొండూరు క్రాస్ రోడ్డు - విస్సన్నపేట ప్రధాన రహదారిలో కుమ్మరికుంట్ల వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.

నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి ద్విచక్ర వాహనంతో సహా ఓ వ్యక్తి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

మృతుడి వద్ద మద్యం సీసా లభించడంతో మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే అదుపుతప్పి బ్రిడ్జిలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఉదయం ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.