BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 09:15 am
Posted by : JULI SRINIVASULU

వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు..

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
31 Aug, 2026 - 09:15 AM
65 వీక్షణలు

వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. ప్రజల్లో ఆనందం

మార్కాపురం: కరువు, మెట్ట ప్రాంతంగా పేరున్న మార్కాపురం ప్రాంతానికి శ్రీ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు చేరుతుండటంతో స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన ప్రజలకు కృష్ణా జలాల రాక ఊరటనిచ్చింది.

వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు నెలకొన్న తరుణంలో కృష్ణా జలాలు మార్కాపురం జిల్లా ప్రాంతంలోకి రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని ఆశించిన వారికి ఇది ఆనందాన్ని కలిగించే పరిణామంగా మారింది.

ఇటీవల ప్రాజెక్టు ట్రయల్ రన్‌లో భాగంగా నీరు పెద్దారవీడు మండలం కలనూతల గ్రామం వైపు చేరడంతో పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసే సమయంలో ఆయా గ్రామాలపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.


 వెలుగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మార్కాపురం ప్రాంత ప్రజల చిరకాల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.