BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 11:45 pm
Posted by : SHAIK CHAND BASHA

కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
29 Aug, 2026 - 11:45 PM
73 వీక్షణలు

కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

కడప, ఇన్ టుడే న్యూస్: కడప నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలకొండల రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

ప్రాథమిక సమాచారం మేరకు మృతులు ఇద్దరూ ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కారు ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రిమ్స్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.