BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 29 August 2026, 08:49 pm
Posted by : SHAIK CHAND BASHA

కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
29 Aug, 2026 - 08:49 PM
68 వీక్షణలు

కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం

అభయాంజనేయ స్వామికి శ్రావణ శనివార ప్రత్యేక పూజలు

​పులివెందుల అర్బన్  

పులివెందుల పట్టణ పరిధిలోని కోతి సమాధి వద్ద గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదానం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ శ్రావణ శోభ సంతరించుకుంది.

తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు,విశేష ఆకుపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి,మహా మంగళహారతి సమర్పించారు.అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.పూజా కార్యక్రమాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు నిర్వహించిన హనుమాన్ భజనలు,సంకీర్తనలు భక్తిభావాన్ని నింపాయి. పూజానంతరం భక్తులందరికీ అన్నదాన వితరణ చేపట్టారు.​పవిత్రమైన శ్రావణ మాసంలో స్వామివారిని ఆరాధించడం,

అన్నదానం చేయడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన ఉభయదాతలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు,స్థానిక ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.