BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:58 pm
Posted by : BOYA SWAMY

సెప్టెంబర్ 5న నకిరేకల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
29 Aug, 2026 - 08:58 PM
133 వీక్షణలు

సెప్టెంబర్ 5న నకిరేకల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

నకిరేకల్ | Ntoday News

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 5న నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

నకిరేకల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నియోజకవర్గంలో చేపట్టనున్న మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఊరుమడ్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము కోరారు.

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి పర్యటన మరింత ఊతమిస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, విద్యా రంగంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.