BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండపర్వలో ఘనంగా మాతృభాష దినోత్సవం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:59 PM
81 వీక్షణలు

కొండపర్వలో ఘనంగా మాతృభాష దినోత్సవం..

గిడుగు రామమూర్తి సేవలు చిరస్మరణీయం: బోట్ల శివ సత్యనారాయణ

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వం:

కొండపర్వ గ్రామంలో మాతృభాష దినోత్సవం, గిడుగు రామమూర్తి జయంతి వేడుకలను ప్రముఖ సామాజిక కార్యకర్త బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి, తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో బోట్ల శివ సత్యనారాయణ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవహారిక భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాష గొప్పతనాన్ని కాపాడుకోవాలని, తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తెలుగు భాషను సగర్వంగా నిలబెట్టుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పామర్తి లక్ష్మీనారాయణ, మూలుగుమటి శ్రీధర్, రామారావు, ఉమామహేశ్వరరావు, రాజు, రాధాకృష్ణ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.