BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 29 August 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడు మాలపల్లిలో ఎమ్మెల్యే రచ్చబండ..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:53 PM
50 వీక్షణలు

కంభంపాడు మాలపల్లిలో ఎమ్మెల్యే రచ్చబండ.. ప్రజల సమస్యలపై తక్షణ స్పందన

ఎన్టీఆర్ జిల్లా | తిరువూరు నియోజకవర్గం | ఏ.కొండూరు

ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామం మాలపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాలపల్లి ప్రజలు వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

దీర్ఘకాలికంగా పరిష్కరించాల్సిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కూటమి ప్రభుత్వం సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చి త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల వద్దకే వెళ్లి, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయడమే రచ్చబండ కార్యక్రమాల లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

నూతన తహసిల్దార్‌కు అభినందనలు

ఏ.కొండూరు మండల నూతన తహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన వైకుంఠరావును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తహసిల్దార్‌కు సూచించారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.