BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:55 PM
221 వీక్షణలు

పోలవరంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం పోలవరం

పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి.ఎస్.వి. బ్రహ్మచారి పాల్గొని మాట్లాడుతూ తెలుగు వారి ఆహారం, ఆహార్యం, సంస్కృతి, సాహిత్యం ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు.

అనంతరం విద్యార్థుల్లో తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెంపొందించేందుకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగిన శతక సాహిత్య పుస్తకాలను అందజేశారు. వేమన శతకం, సుమతి శతకం, కుమార శతకం, దాశరథి శతకం, భాస్కర శతకం, నృసింహ శతకం, ఆంధ్రనాయక శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం పుస్తకాలను పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు బి. మమత విద్యార్థులకు బహూకరించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ క్రీడ హాకీలో విశేష ప్రతిభ కనబరిచి దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు బి. మమత, వ్యాయామ ఉపాధ్యాయుడు డి. శ్రీహరి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.