BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో జయహో బీసీ భారీ సభకు సన్నాహాలు....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:54 PM
70 వీక్షణలు

తిరువూరులో “జయహో బీసీ” భారీ సభకు సన్నాహాలు.. మూడు రోజుల్లో ఘన నిర్వహణ

బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ.. సభ కార్యక్రమాల షెడ్యూల్ విడుదల

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం:

కూటమి ప్రభుత్వం ప్రకటించిన 34 శాతం బీసీ రిజర్వేషన్‌కు మద్దతుగా తిరువూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న “జయహో బీసీ” భారీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు.

తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.

కార్యక్రమాల షెడ్యూల్:

➡️ మధ్యాహ్నం 2:30 గంటలకు

అయ్యప్ప స్వామి ఆలయం సమీపం నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభం.

➡️ మధ్యాహ్నం 2:45 గంటలకు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల సమర్పణ.

➡️ మధ్యాహ్నం 3:00 గంటలకు

నందమూరి తారక రామారావు, డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల సమర్పణ.

➡️ మధ్యాహ్నం 3:15 గంటలకు

డా. బి.ఆర్. అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాల సమర్పణ.

➡️ సాయంత్రం 3:45 గంటలకు

“జయహో బీసీ” భారీ సభ ప్రారంభం.

సభ వేదిక:

దారా పూర్ణయ్య టౌన్‌షిప్, శ్రీనిధి స్కూల్ పక్కన, తిరువూరు.

ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, బీసీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

బైక్ ర్యాలీతో పాటు భారీ సభను ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానం పలికారు.

“జయహో బీసీ” నినాదంతో బీసీల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని నిర్వాహకులు పిలుపునిచ్చారు.