BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:57 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో బీజేపీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
29 Aug, 2026 - 08:57 PM
201 వీక్షణలు

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో బీజేపీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

మంచిర్యాల | N Today News

మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీకి చెందిన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

లక్షెట్టిపేట్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ సురమల్ల సౌజన్య–రాజయ్య శనివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లక్ష్మిపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు తెలిపారు. లక్ష్మిపూర్ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.