BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో రాత్రంతా ఆర్టీసీ బస్సులు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 08:53 PM
92 వీక్షణలు

హైదరాబాద్‌లో రాత్రంతా ఆర్టీసీ బస్సులు.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సేవలు

హైదరాబాద్‌: నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో రాత్రి సమయాల్లోనూ ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఆరు ప్రధాన మార్గాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నారు.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్‌–కొండాపూర్, బాచుపల్లి–వేవ్‌రాక్, సికింద్రాబాద్‌–హయత్‌నగర్, కోఠి–పటాన్‌చెరు, కోఠి–హైటెక్‌సిటీ, సికింద్రాబాద్‌–పటాన్‌చెరు మార్గాల్లో రాత్రి వేళల్లో బస్సులు నడవనున్నాయి.

రాత్రి పూట ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని మార్గాలకు రాత్రి సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది.