BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 11:46 pm
Posted by : BALAKRISHNA BANDI

బాల కార్మికుల బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలితోడ్పాటు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
29 Aug, 2026 - 11:46 PM
81 వీక్షణలు

చిత్తూరు జిల్లా, రొంపిచర్ల: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేట్ విజన్ సొసైటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రొంపిచర్ల మండల కేంద్రంలో గ్రేట్ విజన్ సొసైటీ ఆధ్వర్యంలో బాల కార్మికుల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

రొంపిచర్ల మండలంలోని వర్క్‌షాప్‌లు, వివిధ వ్యాపార సంస్థలు, ఇతర పని ప్రదేశాల్లో బాల కార్మికులు పనిచేయకుండా చూడాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారు. బాలలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని, బాలలకు పనికంటే విద్యే ముఖ్యమని నిర్వాహకులు తెలిపారు.

ప్రతి బాలుడు బడికి వెళ్లి విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు, వ్యాపార యజమానులు, ప్రజలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాలలను పనుల్లోకి పంపకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

బాల కార్మికులను పనుల్లో నియమించుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రేట్ విజన్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గ్రేట్ విజన్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ జి.వి. సుబ్రహ్మణ బాబు ఆధ్వర్యంలో రొంపిచర్లతో పాటు పులిచెర్ల మండలంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ బాల కార్మికుల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండల సబ్‌ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, గ్రేట్ విజన్ సొసైటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. బాల కార్మికులను గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి, వారిని తిరిగి పాఠశాలలకు పంపించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.