BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 31 August 2026, 08:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసు రిమాండ్ రిపోర్ట్ మార్పు....

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:46 AM
75 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసు రిమాండ్ రిపోర్ట్ మార్పు.. ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్

గంజాయి కేసులో నిందితుడు స్టేషన్ నుంచి పరారైన ఘటనలో రిమాండ్ రిపోర్ట్ మార్చిన భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహిమున్నీసా బేగంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొద్ది రోజుల క్రితం గంజాయి పట్టుకున్న కేసులో నిందితులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అయితే స్టేషన్‌లో ఉన్న సమయంలో ఒక నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు పలు అంశాలను పరిశీలించారు.

కేసుకు సంబంధించిన పంచనామా వివరాలను మార్చి, కేవలం ఒక నిందితుడిని మాత్రమే కోర్టులో హాజరుపరిచినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. పంచనామా, ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలపై లోతుగా పరిశీలించిన అనంతరం సీఐ రహిమున్నీసా బేగంపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.