BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్ల పంపిణీ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:29 PM
60 వీక్షణలు

మధిరలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్ల పంపిణీ

మధిర టౌన్, ఆగస్టు 30: మానవ సేవే భగవంతుని సేవ అనే భావనతో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లంకా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా పాతబట్టలు, సామాన్లు పంపిణీ చేశారు.

మధిర పట్టణంలోని అజాద్ రోడ్డులో లంకా కొండయ్య నివాసం వద్ద ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ ఉచిత పాతబట్టల కేంద్రం, హెల్పింగ్ హోమ్ ద్వారా వివిధ దాతలు అందించిన వస్త్రాలు, గృహ సామగ్రిని సంచార జాతులకు చెందిన పేద కుటుంబాలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సీపీఎం నాయకులు శీలం నర్సింహారావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా శీలం నర్సింహారావు తన ఇంట్లోని అదనపు దుస్తులను కూడా వితరణ చేశారు.

ఈ సేవా కార్యక్రమానికి మడుపల్లి చెందిన సాగి వెంకట్రావమ్మ, మధిర సీపీఎం మహిళా నాయకులు మండవ ఫణీంద్ర కుమారి, మధిర నివాసి చావా నర్సింహారావు, అజాద్ రోడ్డుకు చెందిన మన్నే ప్రభాత్ పార్వతి దంపతులతో పాటు పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు దుస్తులు, సామాన్లు అందించారు.

దాతలు అందించిన వస్తువులను లంకా సేవా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా శీలం నర్సింహారావు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో లంకా సేవా ఫౌండేషన్ సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.