BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 30 August 2026, 09:04 pm
Posted by : కూనురు మధు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
30 Aug, 2026 - 09:04 PM
121 వీక్షణలు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజేయు–ఐజేయు) నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అన్నారు.

కనగల్‌లో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజేయు మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయించేందుకు సంఘం తరఫున పోరాడుతామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం కనగల్ మండల ప్రెస్ క్లబ్ (టీయూడబ్ల్యూజేయు) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుంకిరెడ్డి జాగాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మల్లెపల్లి నరసింహ, ఉపాధ్యక్షులుగా దాసిరెడ్డి నవీన్ రెడ్డి, మహేశ్వరం రమేష్ కుమార్, కోశాధికారిగా రాయల సునీల్ కుమార్, కార్యదర్శిగా పాలకూరి లింగస్వామి, సహాయ కార్యదర్శిగా తొరకొప్పుల నాగయ్య ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా చీదేటి వంశీధర్ రెడ్డి, మాచర్ల లక్ష్మీనారాయణ తదితరులు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి దోటి శ్రీనివాస్, అక్షర కలం ఎడిటర్ పిట్టల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.