BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 31 August 2026, 08:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

22ఏ భూముల అంశంపై అధికారుల్లో ఆందోళన...

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:45 AM
79 వీక్షణలు

22ఏ భూముల అంశంపై అధికారుల్లో ఆందోళన.. నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు కసరత్తు

హైదరాబాద్‌: 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల అంశంపై ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) కమిషనర్ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించినట్లు తెలుస్తోంది.

నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన భూములను పరిశీలించి వెంటనే తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్ల పరిధిలో లేని, సీసీఎల్‌ఏ పరిధిలోకి వచ్చే భూముల తొలగింపునకు కూడా ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు తెలిసింది.

ఆదివారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల వారీగా 22ఏ భూముల వివరాలు, పెండింగ్‌ అంశాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం.

ఇటీవల 22ఏ అంశంపై బీఆర్ఎస్ నేతలు ప్రజల తరఫున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, త్వరలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

అయితే 22ఏ భూముల వ్యవహారంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుతం జరుగుతున్న మార్పులపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.