BREAKING
thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం thumb ● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు.. thumb ● ఇందిరమ్మ ఇళ్లు పేదల హక్కు.. రాజకీయ జోక్యాన్ని నివారించాలి thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం thumb ● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు.. thumb ● ఇందిరమ్మ ఇళ్లు పేదల హక్కు.. రాజకీయ జోక్యాన్ని నివారించాలి
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:42 pm
Posted by : SEETHA KIRAN KUMAR

AEE పరీక్ష తేదీ మార్పు.. నవంబర్ 7కు వాయిదా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Oct, 2026 - 09:42 PM
10 వీక్షణలు
  • అభ్యర్థులకు కీలక సూచన

హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్‌: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ (AEE) పరీక్ష తేదీని మారుస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6న జరగాల్సిన పరీక్షను నవంబర్ 7న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే జూనియర్ ఇంజినీర్‌ (JE) పరీక్ష, TGPSC AEE పరీక్ష ఒకే రోజున ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో AEE పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు రావడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

SSC JE, AEE పరీక్షలు ఒకే రోజున ఉన్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అవసరమైన ధ్రువపత్రాలను ఇమెయిల్ ద్వారా పంపించాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు గడువులోగా సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాలని తెలిపింది.