ఏలూరు: జడ్పీ సీఈఓ కార్యాలయంలో ఏసీబీ వల.. జూనియర్ అసిస్టెంట్ పట్టివేత
ఏలూరు: అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏలూరులో వల పన్ని జడ్పీ సీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. మాతంగి పవిత్రన్ జడ్పీ సీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఒక పని నిమిత్తం రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం సాయంత్రం పక్కా ప్రణాళికతో వల పన్ని లంచం తీసుకుంటున్న సమయంలో పవిత్రన్‌ను పట్టుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు ట్రాప్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. లంచం డిమాండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నగదు స్వాధీనం, కేసు నమోదు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ట్రాప్ పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.