BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 06:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:49 PM
63 వీక్షణలు

ఏలూరు: పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

ఏలూరు, ఆగస్టు 23:

ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, అమరజీవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీస్ అధికారులు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రకాశం పంతులు చేసిన త్యాగాలు, చూపిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. దేశభక్తి, ప్రజాసేవలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమ సమయంలో బ్రిటీష్ పోలీసుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలబడి చూపిన ధైర్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ప్రజానాయకుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు తీసుకున్న పాలనా నిర్ణయాలు నేటికీ ఆదర్శప్రాయంగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు.