BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

బీసీలకుబీసీలకు రిజర్వేషన్ల పేరిట కూటమి మోసం: పాటి శివకుమార్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
23 Aug, 2026 - 10:01 PM
14 వీక్షణలు

బీసీలకు రిజర్వేషన్ల పేరిట కూటమి మోసం: పాటి శివకుమార్ ధ్వజం

స్థానిక సంస్థల్లో బీసీలను అణగదొక్కిందే టీడీపీ చరిత్రమాట తప్పకుండా బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్‌ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ స్పష్టీకరణ

సఖినేటిపల్లి :

2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలుకాని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు బీసీలను నిలువునా మోసం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం కేవలం బీసీలను మభ్యపెట్టేందుకేనని ఆయన కొట్టిపారేశారు2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బీసీల అభ్యున్నతి కోసం జీవో నెం. 176 ద్వారా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. అయితే టీడీపీ నేత బీర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించి ఆ రిజర్వేషన్లను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుదని విమర్శించారు. కోర్టు తీర్పుల కారణంగా రిజర్వేషన్ శాతం తగ్గినప్పటికీ, వైఎస్ జగన్ వెనక్కి తగ్గకుండా జనరల్ స్థానాల్లోనూ బీసీలకే కేటాయించి అత్యున్నత న్యాయం చేశారని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో బీసీలకు దక్కిన రికార్డు ప్రాధాన్యత,

గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు దక్కిన రాజకీయ వాటాను ఆయన గణాంకాలతో వివరించారు

 రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లకు గాను 9 మేయర్ స్థానాలు (69%) బీసీలకే కేటాయించా

13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 6 స్థానాలను (46%) బీసీలకు ఇచ్చారు.

636 మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 239 మందిని (38%) కూర్చోబెట్టారు.

84 మున్సిపాలిటీలలో 44 స్థానాలను (46%) మున్సిపల్ చైర్మన్ లను బీసీ వర్గాలకే దక్కించారు.

196 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 76 చైర్మన్ పదవులు బీసీలకే ఇచ్చారు.

137 రాష్ట్ర స్థాయి జనరల్ కార్పొరేషన్లలో 53 చైర్మన్ పదవులు కేటాయించారు.

11 మంది రాజ్యసభ ఎంపీల్లో నలుగురు బీసీలను పార్లమెంట్‌కు పంపిన ఘనత జగన్‌దే.

దేవాదాయ ధర్మకర్తల మండళ్లు, ఇతర నామినేటెడ్ పోస్టులలో సైతం 50 శాతానికి పైగా స్థానాలు కల్పించారని తెలిపారు.

ఎన్నికల సమయంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. గెలిచాక ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వైసీపీ కోర్టుకు వెళ్తుందంటూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. బీసీలకు మేలు జరిగితే అత్యంత సంతోషించేది జగన్మోహన్ రెడ్డేనని, బీసీ సమాజం అమాయకులు కాదని, కూటమి మోసాలకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని పాటి శివకుమార్ హెచ్చరించారు.