BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 09:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 09:40 PM
212 వీక్షణలు

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల.. సెప్టెంబరు 7న ఓటర్ల జాబితా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాచరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా కీలక తేదీలను వెల్లడించింది. సెప్టెంబరు 7న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. సెప్టెంబరు 20 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనున్నారు. సెప్టెంబరు 23న అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ పూర్తిచేయనున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 28న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అక్టోబరు 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబరు 14న నామినేషన్ల పరిశీలన, అక్టోబరు 19న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు.

అక్టోబరు 28న పోలింగ్‌ నిర్వహించడంతో పాటు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబరు 1న వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు, అధికారులు, సంబంధిత వర్గాలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.