BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 23 August 2026, 09:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌: జనసేన వైపు కొండా సుస్మిత అడుగులు? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 09:41 PM
90 వీక్షణలు

హైదరాబాద్‌: జనసేన వైపు కొండా సుస్మిత అడుగులు? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

రేపు జనసేన కీలక నేతలతో భేటీకి సన్నాహాలు?

తెలంగాణ రాజకీయాల్లో కొండా సుస్మిత వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది. 

జనసేన పార్టీలోకి కొండా సుస్మిత చేరే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపు జనసేనకు చెందిన కీలక నేతలతో ఆమె భేటీ కానున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే తన నిర్ణయాన్ని ఇప్పటికే సుస్మిత స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో టికెట్‌ విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై ఆమె ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

జూబ్లీహిల్స్‌లోని ఓ కీలక నేత నివాసంలో భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో పరకాల టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయ బాధ్యతలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే కొండా సుస్మిత జనసేనలో చేరతారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? అన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.