BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 19 July 2026, 09:12 pm
Posted by : V శ్రీనివాస్

​ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ (మైనింగ్) సీటు సాధించిన భైరపాక దవల్ జఫ్రీకి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అభినందనలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 09:12 PM
138 వీక్షణలు

​ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ (మైనింగ్) సీటు సాధించిన భైరపాక దవల్ జఫ్రీకి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అభినందనలు

మంచిర్యాల పట్టణానికి చెందిన భైరపాక దవల్ జఫ్రీ జేఈఈ అడ్వాన్స్డ్-2026లో అఖిల భారత స్థాయిలో 2301వ ర్యాంకు సాధించి, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మైనింగ్ విభాగంలో బీటెక్ సీటు సాధించాడు.

​దవల్ జఫ్రీ తండ్రి ఐజక్ అనిల్ కుమార్ ఆర్‌జీహెచ్‌పీ పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా, తల్లి దమయంతి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మైనారిటీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆయన, అనంతరం ఆల్ ఫోర్స్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్డ్లో తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు.

​ఈ నెల 21న దవల్ జఫ్రీ ఐఐటీ ఖరగ్‌పూర్‌కు వెళ్లనున్న సందర్భంగా ఆల్ ఫోర్స్ కళాశాల యాజమాన్యం ఆదివారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు దవల్ జఫ్రీని ఘనంగా సన్మానించి రివార్డు అందజేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచిర్యాల విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ దాసరి శ్రీనివాస్, గణిత అధ్యాపకుడు కిరణ్ కుమార్, అధ్యాపక బృందం, డాక్టర్ జయరావు, విద్యార్థి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు