BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 01:54 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గద్వాల మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాల సేకరణపై ఆరోపణలు

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 01:54 PM
16 వీక్షణలు

టెండర్లు లేకుండానే వ్యర్థాల సేకరణ జరుగుతోందని విమర్శలు.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

జోగులాంబ గద్వాల, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

జోగులాంబ గద్వాల మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాల సేకరణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని 37 వార్డుల్లో ఉన్న చికెన్ దుకాణాల నుంచి వెలువడే వ్యర్థాలను బహిరంగ టెండర్లు, ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ లేకుండానే స్థానిక అధికార నేతకు చెందిన బంధువు సేకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం కోల్పోతున్నామని, ఏటా రూ.30 లక్షలకు పైగా అక్రమంగా సంపాదిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇతర మున్సిపాలిటీల్లో చికెన్ వ్యర్థాల సేకరణకు టెండర్లు నిర్వహించడం ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం. గద్వాలలో మాత్రం టెండర్ల ప్రక్రియ లేకుండానే సేకరణ జరుగుతోందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

వ్యర్థాల తరలింపులో జీపీఎస్ వాహనాల వినియోగం, కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల నిబంధనలు పాటించడం లేదని, నిషేధిత చేపల చెరువులకు వ్యర్థాలను తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికార నేతల ఒత్తిళ్ల కారణంగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఈ ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ స్పందిస్తూ.. చికెన్ వ్యర్థాల సేకరణకు సంబంధించి త్వరలో కౌన్సిల్‌లో తీర్మానం చేసి, టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.