BREAKING
thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు
Date of Publish : 05 October 2026, 10:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంపై ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 10:18 AM
1 వీక్షణలు

అధికారుల చర్యలపై స్థానికుల ప్రశ్నలు

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, తరలింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల పరిధిలో ప్రతి నెలా రేషన్ పంపిణీ ప్రారంభమైన సమయంలోనే బియ్యం సేకరణ, తరలింపు జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. విస్సన్నపేట కేంద్రంగా నిర్మానుష్య ప్రాంతాలు, కాలువల సమీప ప్రాంతాలు, పుట్రేల గ్రామం పరిసరాల్లోని మారుమూల ప్రాంతాల వైపు రేషన్ బియ్యం తరలింపునకు సంబంధించిన వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సేకరించి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారని, ఈ వ్యవహారం కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో తరలిపోతున్నట్లు వస్తున్న ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం కొనుగోళ్లు, తరలింపులు నిజమేనా, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, వినియోగిస్తున్న వాహనాలు ఏవి అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.