BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 06:04 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వారెంట్ లేకుండా ఇంట్లో సోదాలు చేశారంటూ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Nov, 2026 - 06:04 AM
3 వీక్షణలు

ఘటనపై సమగ్ర విచారణ జరపాలని హిందూ చైతన్య వేదిక, విశ్వహిందూ పరిషత్ డిమాండ్

చిత్తూరు: దీపావళి సందర్భంగా కాల్చిన టపాసులు తమ ఇంటిపై పడ్డాయనే కారణంతో హయత్ ఫ్రూట్స్‌కు చెందిన కుటుంబ సభ్యులు తమ ఇంటిపై దాడికి ప్రయత్నించారని తేజా స్వీట్స్ యజమాని రవి ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వ్యవహారశైలిపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వారెంట్ లేకుండానే తమ ఇంట్లో సోదాలు నిర్వహించారని, కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ నెల 9వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా తాము టపాసులు కాల్చామని రవి తెలిపారు. ఈ క్రమంలో షాట్స్ అధిక శబ్దంతో పేలడంతో హయత్ ఫ్రూట్స్‌కు చెందిన వారు తమపై దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

అయితే, ఈ ఘటన అనంతరం పోలీసులు తమ ఇంటికి వచ్చి వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించారని రవి ఆరోపించారు. కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతినిధులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో ఓఎస్‌డీ, ఏఎస్పీ షాను, వన్‌టౌన్ సీఐపై దాఖలైన కేసు రేపు విచారణకు రానున్నట్లు ఫిర్యాదుదారుల వర్గం తెలిపింది.

గమనిక: పోలీసులపై, హయత్ ఫ్రూట్స్ కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు సంబంధిత వ్యక్తులు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరిచాం. ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక వివరణ అందుబాటులో లేదు. కోర్టు విచారణలో వెలువడే వివరాలు తదుపరి స్పష్టతనివ్వనున్నాయి.