BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు
Test 4
Date of Publish : 09 November 2026, 05:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి హాస్టల్ గదిలో విగతజీవిగా బీటెక్ పట్టభద్రుడు 21 ఏళ్ల రిషి రెడ్డి మృతితో రామన్నపేటలో విషాదఛాయలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 05:27 AM
26 వీక్షణలు

జగిత్యాల జిల్లా, నవంబర్ 9: అమెరికాలో జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ రిషి రెడ్డి (21) అమెరికాలోని హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించినట్లు సమాచారం. చిన్న వయసులోనే విదేశాల్లో స్థిరపడిన కుటుంబానికి చెందిన రిషి రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితమే రిషి రెడ్డి కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఇటీవల రిషి రెడ్డి బీటెక్ విద్యను పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హాస్టల్ గదిలో అతడు మృతిచెంది ఉన్నట్లు తెలిసింది. యువకుడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రిషి రెడ్డి మృతివార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి నానమ్మ రామన్నపేట గ్రామంలో నివాసం ఉంటుండటంతో గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు చిన్న వయసులోనే మృత్యువాత పడటంతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం రామన్నపేటకు తీసుకువస్తారా, లేక అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తారా అనే విషయంపై కుటుంబ సభ్యుల నిర్ణయం తెలియాల్సి ఉంది. యువకుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది.