BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 07:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 07:02 PM
85 వీక్షణలు

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

నాలుగు దశల్లో వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

ఈ జాబ్ క్యాలెండర్‌లో భాగంగా గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

అలాగే పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా జాబ్ క్యాలెండర్‌తో వేలాది మంది అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.