BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 05:02 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

తెలంగాణ
09 Nov, 2026 - 05:02 PM
32 వీక్షణలు

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు బాలానగర్ అంబేద్కర్ సంఘం సభ్యుల వినతి

మహబూబ్‌నగర్, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

జాతీయ రహదారి 44 (NH-44)పై బాలానగర్ ముఖ్య కూడలిలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మరో ప్రదేశానికి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేసేందుకు సహకరించాలని నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ బాలానగర్ మండల అంబేద్కర్ సంఘం సభ్యులను కోరినట్లు వారు తెలిపారు.

విగ్రహాన్ని మరో ప్రదేశంలో ఏర్పాటు చేస్తే నూతన విగ్రహంతో పాటు విగ్రహం చుట్టూ ప్రహరీ గోడ, ఐమాక్స్ లైట్, గ్రీన్ పార్క్, గ్రానైట్ మెట్లు, శిలాఫలకాలు తదితర అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చులన్నీ తానే భరిస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చినట్లు అంబేద్కర్ సంఘం సభ్యులు పేర్కొన్నారు.

అయితే హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో నిర్లక్ష్యం జరుగుతోందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాలానగర్ మండల అంబేద్కర్ సంఘం సభ్యులు సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాంట్రాక్టర్‌తో మాట్లాడి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. విగ్రహం ఏర్పాటు, దానికి సంబంధించిన ఇతర అభివృద్ధి పనులన్నీ హామీ మేరకు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.