BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:53 am
Posted by : కూనురు మధు

గోపాలపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
28 Nov, 2026 - 06:53 AM
42 వీక్షణలు

రైల్వే గేట్‌తో నిత్యం ఇబ్బందులు.. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌కు తప్పని నిరీక్షణ

నల్గొండ జిల్లా: నార్కట్‌పల్లి మండలం గోపాలపల్లి గ్రామ ప్రజలు రైల్వేగేట్ కారణంగా నిత్యం రాకపోకల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైళ్ల రాకపోకల సమయంలో గేట్ మూసివేయడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం గేట్ వద్ద నిలిచిపోవాల్సి వస్తుండటంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణాన్ని కోరుతున్నారు. గోపాలపల్లి పాత ఊరిలోని జమ్మి చెట్టు రోడ్డు నుంచి తెట్టబాయి వరకు పెద్ద సీసీ రహదారిని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రైల్వే గేట్ మూసివేసిన సమయంలోనూ గ్రామ ప్రజలు రాకపోకలు సాగించడంతో పాటు అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలు సులభంగా వెళ్లేందుకు వీలుంటుందని పేర్కొంటున్నారు . గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన ప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు.