BREAKING
thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు
Date of Publish : 30 September 2026, 08:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నిదానపురంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 08:34 PM
1 వీక్షణలు

మధిర: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా “అంగన్ మిలన్ సేవా” కార్యక్రమాన్ని బుధవారం మధిర మండలం నిదానపురం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-1లో నిర్వహించారు. మధిర మండల అధ్యక్షులు గడ్డం శ్రీహరి చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గుండా చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు, టీకాలు, బాలల అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా చిన్నారులు, గర్భిణీలకు అందుతున్న టీకాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా అర్హత కలిగిన గర్భిణీలు, బాలింతలకు అందుతున్న ఆర్థిక సహాయంపై వివరించారు.

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. “ఆరోగ్యవంతమైన తల్లి – ఆరోగ్యవంతమైన బిడ్డ – బలమైన భారత్” అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, సంక్షేమ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుండా చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ మధిర మండల మహిళా మోర్చా నాయకులు చల్లా శైలజ, గుండా శ్రీలక్ష్మి, అమరవాది రాజేశ్వరి, అమరావతి శిల్పిత, అమరవాది పద్మ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ్ ఎం. రఘురామిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.