BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 04:06 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

బొగ్గులగొంది అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
04 Oct, 2026 - 04:06 PM
7 వీక్షణలు

కనిగిరి: జాతీయ పోషణ మాసంలో భాగంగా ‘మన అంగన్వాడీ.. మన బాధ్యత’ కార్యక్రమం కింద కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గులగొంది అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్ పసుపులేటి అంకమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా పోషక పదార్థాలతో రూపొందించిన లోగోను ప్రదర్శించారు. అనంతరం పద్మావతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను పోషణ, సంరక్షణ, చిన్నారుల ప్రాథమిక విద్యాభివృద్ధికి సంబంధించిన సమాజ ఆధారిత కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మార్చడం లక్ష్యమన్నారు. పోషణపై సమష్టి బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎన్‌సీ మెనూ బోర్డుల ప్రదర్శన, ఈసీ విద్యాబోధన, గృహ సందర్శనలు, చిన్నారుల జీవితంలోని మొదటి 1,000 రోజుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అభివృద్ధిలో ఆలస్యం ఉన్నట్లు అనుమానం ఉన్న పిల్లలను గుర్తించడం, పీఎంఎంవీవై పథకంలో నమోదు, లబ్ధిదారుల వివరాలు, ఏఐ స్కానింగ్, స్టిమ్యులేషన్, ఏఎంసీ కమిటీ బాధ్యతలపై వివరించారు.

అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు. పోషకాహారం ప్రాముఖ్యతపై చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకుడు నరాల శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు ధనలక్ష్మి, నరసింహారావు, ఫాతిమా, అంగన్వాడీ వర్కర్లు పసుపులేటి అంకమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.