BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 09:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్తగూడెం, సోమవరం గ్రామాల్లో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 09:51 PM
11 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కొత్తగూడెం, సోమవరం గ్రామాల్లో సోమవారం అంగన్వాడీ ఉత్సవాలను ఘనంగా అంగన్వాడి పర్యవేక్షకురాలు పి గాయత్రి దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సోమవరం, కొత్తగూడెం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి గ్రామ పెద్దలు ఎర్రోజు రాంప్రసాద్, మలగలపల్లి సుబ్రహ్మణ్యం, ఎర్రా రాజారామ్మోహన్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఎన్‌ఎం రాజేశ్వరీదేవి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారుల తల్లులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, ఎదుగుదలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై స్పందించే విధానం, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై కూడా అవగాహన కల్పించారు.

అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు అంగన్వాడీ సూపర్‌వైజర్, ఏఎన్‌ఎం, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి చీర, జాకెట్, గాజులు, శాలువాలు అందజేశారు.