బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
ఆళ్లగడ్డ మండలం, బత్తలూరు: గ్రామంలో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తై 21 రోజులు కావడంతో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం భక్తులు, గ్రామస్థులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆలయ ప్రతిష్ఠ అనంతరం 21వ రోజు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.