పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
పులివెందుల, సెప్టెంబర్ 19, Ntoday న్యూస్: పులివెందుల పట్టణంలోని వివిధ వినాయక మండపాల వద్ద శనివారం నిర్వహించిన లడ్డూ వేలం పాటలు ఉత్సాహంగా సాగాయి. భక్తులు వేలం పాటల్లో పాల్గొని లడ్డూలను దక్కించుకున్నారు.
బాపనపల్లెలోని శ్రీరామ ఆలయం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో జస్వంత్ రెడ్డి రూ.2,300కు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే రిషి స్కూల్ వెనుక వైపు నిర్వహించిన వేలంలో వీరారెడ్డి రూ.2,200కు లడ్డూను కైవసం చేసుకున్నారు.
వేలం కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. లడ్డూలను దక్కించుకున్న వారు వాటిని ప్రసాదంగా భావిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకున్నారు.