BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 01:42 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

యజమాని అంత్యక్రియల వరకు వెంట.. శునకం విశ్వాసానికి గ్రామస్థులు భావోద్వేగం

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
20 Sep, 2026 - 01:42 PM
9 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో ఘటన.. చివరి వరకు మృతదేహం వద్దే ఉన్న శునకం

మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం: యజమానిపై ఓ శునకం చూపించిన విశ్వాసం, అనుబంధం గ్రామస్థులను భావోద్వేగానికి గురిచేసింది. దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. ఈ క్రమంలో మృతుడి వద్ద పెంచుకున్న శునకం కూడా వారి వెంట శ్మశానవాటిక వరకు వెళ్లింది.

అక్కడ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మృతదేహం వద్దే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం చితి చుట్టూ తిరుగుతూ కనిపించడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు.

యజమాని చివరి ప్రయాణంలోనూ శునకం వెంట ఉండటం అక్కడున్న వారిని కదిలించింది. ఈ ఘటనతో మనుషులు–మూగజీవుల మధ్య ఏర్పడే అనుబంధం, విశ్వాసం మరోసారి చర్చకు వచ్చింది.