BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 11:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Sep, 2026 - 11:41 AM
17 వీక్షణలు

చాట్రాయి మండలంలోని ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి ఏవో బి శివశంకర్ 

చాట్రాయి మండలం: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులకు ఎల్‌నినో ప్రభావంతో పంటలపై ఏర్పడే పరిస్థితులు, రైతులకు అందించాల్సిన సూచనలు, నీటి యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యత, పంట నమోదు తదితర అంశాలపై మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ అవగాహన కల్పించారు.

రైతులందరూ తమ పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకునేలా వ్యవసాయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని అన్ని పంటలను సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ సహాయకులు తరచూ పరిశీలించాలని, రైతులకు అందుబాటులో ఉంటూ నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు..

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున పంటల్లో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా అవసరమైన సమయంలో ద్రవ జీవామృతాన్ని పేడ, ఆవు మూత్రం, శెనగపిండి వంటి పదార్థాలతో తయారు చేసి పంటలపై పిచికారీ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఘన జీవామృతం, పంచకావ్యం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వినియోగించడం ద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలను అందించవచ్చని పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. పంటలకు అవసరమైన నీటిని సమర్థంగా వినియోగించుకోవడం, నేలలో తేమను కాపాడుకోవడం వంటి చర్యలపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.

ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఏపీఎఫ్‌ఆర్‌ నమోదు పూర్తి చేసుకుని, విశిష్ట సంఖ్య గుర్తింపును రైతు సేవా కేంద్రం వద్ద పొందాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. ప్రతి రైతు పంట నమోదు, అవసరమైన గుర్తింపు ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసుకునేలా గ్రామస్థాయి వ్యవసాయ సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు.