BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 01:37 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో మెండెం కిరణ్ కుమార్.. స్వతంత్రంగా పోటీకి సిద్ధం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
20 Sep, 2026 - 01:37 PM
6 వీక్షణలు

సెప్టెంబర్ 27 నుంచి 11 పట్టణాల్లో సదస్సులకు ఏర్పాట్లు

ఖమ్మం–నల్గొండ–వరంగల్: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి విద్యావేత్త మెండెం కిరణ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన తదుపరి ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కదలికలు కూడా ప్రారంభమయ్యాయి.

కిరణ్ కుమార్ గత కొంతకాలంగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో యువత, పట్టభద్రులతో పరిచయాలు కొనసాగిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 27 నుంచి 11 పట్టణాల్లో సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

పట్టభద్రులు, యువత, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై ఈ సదస్సుల్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన అభ్యర్థిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పట్టభద్రుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ ఎమ్మెల్సీ స్థానానికి వివిధ పార్టీల అభ్యర్థిత్వంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. జనసేన ఇప్పటికే డాక్టర్ గడల శ్రీనివాసరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో భాగంగా పట్టభద్రుల ఓటర్ల జాబితా పునఃసిద్ధీకరణ జరుగుతోంది. సెప్టెంబర్ 28న ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన నోటీసు జారీ కానుండగా, తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30న ప్రకటించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో మెండెం కిరణ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా చేపట్టనున్న సదస్సులు, ప్రచార కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.