లర్నెస్ ల్యాండ్ స్కూల్ విద్యాసంస్థల అధినేత తాళ్ల మల్లేశం మృతి
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: వరంగల్‌కు చెందిన లర్నెస్ ల్యాండ్ స్కూల్ విద్యాసంస్థల అధినేత తాళ్ల మల్లేశం శనివారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తాళ్ల పద్మావతి పేరుతో విద్యాసంస్థలను కొనసాగిస్తూ విద్యాభివృద్ధికి తాళ్ల మల్లేశం కృషి చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యారంగంలో తనదైన సేవలు అందించారు.
మల్లేశం మృతితో లర్నెస్ ల్యాండ్ విద్యాసంస్థల్లో విషాద వాతావరణం నెలకొంది. ఆయన మృతి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యారంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.