BREAKING
thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు
Date of Publish : 20 September 2026, 05:03 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
20 Sep, 2026 - 05:03 PM
11 వీక్షణలు

మృతదేహానికి నివాళులర్పించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంటకు చెందిన మిద్దె నాగార్జున హత్య ఘటనపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. నాగార్జున మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

నాగార్జున స్వగ్రామం భీమవరానికి వెళ్లిన భూమా అఖిలప్రియ.. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. నాగార్జున హత్య అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడినట్లు తేలిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపారు.

నాగార్జున కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు అండగా ఉంటామని, ఆయన పిల్లల భవిష్యత్తు, చదువుల విషయంలో బాధ్యత తీసుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

కాగా, నాగార్జున హత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు, నిందితుల పాత్రపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.