గణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న YSRCP మండల పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
పామూరు
పామూరు మండలం, బొట్లగుండూరు: గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పామూరు మండల అధ్యక్షుడు గంగసాని హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. మండప నిర్వాహకులతో పాటు స్థానికులతో కార్యక్రమ వివరాలపై మాట్లాడారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు కల్లూరి రామిరెడ్డి, పోలినేని శ్రీనివాసులు, ఎర్రి కృష్ణారెడ్డి, షేక్ గయాజ్, తుపాకుల ఆంజనేయులు రెడ్డి, బుల్లెట్ రమేష్, జొన్నలగడ్డ గోవిందయ్య, రామకృష్ణ, కృష్ణయ్య, గంజి రవీంద్ర, ప్రహ్లాద, రవికిరణ్ శర్మ, వెంకటరెడ్డి, వెంకటరావుతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.