తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది?
బీజేపీ అమలుచేస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరం
ఐద్వా సీనియర్ నాయకురాలు టి జ్యోతి
2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యల వివరాలు సేకరించాలి
సెప్టెంబర్ 25-30 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు
సెప్టెంబర్ 30న సెన్సెస్ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
NPRD రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య
హైదరాబాద్/ఎన్ టుడే న్యూస్.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చిక్కడపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రైతంగా సాయుధా పోరాట వార్షికోత్సవ ఉత్సవాల సందర్బంగా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం వాస్తవాలు - వక్రీకరణాలు అనే అంశంపై సెమినార్ సంఘం రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ అధ్యక్షతన జరిగింది.
సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా సీనియర్ నాయకురాలు టి జ్యోతి మాట్లాడుతూ* తెలంగాణ రైతంగసాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. నైజం నవాబ్ అరాచకాలకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుండి విముక్తి కోసం సాధారణ ప్రజలు సాయుదులై తిరగబడిన పోరాటామని అన్నారు.గ్రామీణ ప్రాంతంలో కొనసాగుతున్న సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినరాని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో జరిగిన పోరాటం ఫలితంగా 3500 మంది అమరులు అయ్యారని, భూమి లేని పెదప్రజలకు 10 లక్షల ఎకరాల సాగుభూమిని పంచిన చరిత్ర తెలంగాణ రైతంగా సాయుధ పోరాటానికి ఉందని అన్నారు.తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పోరాట చరిత్రను వక్రీకరించాలని కుట్రలు చేస్తుందని అన్నారు.నైజం నవాబ్ కు వ్యతిరేకంగా హిందూ, ముస్లిం లు, కుల మాతలకు అతీతంగా పోరాటాలు చేశారానే విషయం గుర్తించుకోవాలని అన్నారు.ముస్లిం రాజుపై హిందూ ప్రజలు విజయం సాధించారాని బీజేపీ చెప్పడం సిగ్గు చెటని అన్నారు. తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించాలని బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రైతంగా సాయుధా పోరాటం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి ఎక్కడిదని అన్నారు.
NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ 2027 జనాభా లెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వం వికలాంగుల జనాభా లెక్కలను తగ్గించాలని కుట్రలు చేస్తుందని అన్నరు. 2016 వికలాంగుల హక్కుల చట్టం 21 రకాల వైకాల్యలను గుర్తిస్తే 2027 జనాభా లెక్కల్లో 9 రకాల వికలాంగుల వివరాలను నమోదు చేయాలని ఎందుకు నిర్ణయం చేశారాని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం 21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలని సెప్టెంబర్ 25 నుండి 30 వరకు దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సెప్టెంబర్ 30 నాడు హైదరాబాద్ లోని సెన్సెస్ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ ఉపాధ్యక్షులు కాశప్ప, సహాయ కార్యదర్శులు నాగలక్ష్మి, బాలేశ్వర్, రాజు, గంగాధర్ రాష్ట్ర కమిటీ సభ్యులు భుజంగారెడ్డి, షాయిన్ బేగం, బంగారయ్య, నర్సింహా, మల్లేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.