శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఉరుమడ్ల కాంగ్రెస్ నాయకులు
ఆంధ్రప్రదేశ్
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల, సెప్టెంబర్ 20: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉరుమడ్ల గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, జన్నపాల శ్రీను, పోలగోని నరసింహ, మేడబోయిన శ్రీను, పోలగోని చిన్న నరసింహ, బోయ స్వామి, మర్రి రమేష్, పోలగోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.