BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:16 pm
Posted by : K MAHESH

అన్నపూర్ణ మృతి పార్టీకి తీరని లోటు -ఎమ్మెల్యే కోరం కనకయ్య

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:16 PM
12 వీక్షణలు

ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ

బయ్యారం, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

గంధంపల్లి, కొత్తపేట గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి పార్టీకి తీరని లోటని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. అన్నపూర్ణ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం గ్రామంలోని ఆమె నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే, అన్నపూర్ణ పార్థివదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను కలిసి అన్నపూర్ణ మృతి గురించి, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆప్తురాలిని కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా అన్నపూర్ణ మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలకంటి సీతారాం రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కారుబోతుల రామ్మూర్తి, వార్డు సభ్యులు బొమ్మకంటి రాంబాబు, భూక్య శ్రీను, నాయకులు దార రఘుపతి, కొండ సంతోష్, రాందాస్, అశోక్ రెడ్డి, బాలరాజు, సతీష్, భీముడు తదితరులు పాల్గొన్నారు.