BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 07:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ తీరానికి తుపాను ముప్పు!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 07:53 PM
35 వీక్షణలు

నవంబర్ 17 నాటికి దక్షిణ కోస్తా తీరానికి చేరే అవకాశం

నెల్లూరు నుంచి మచిలీపట్నం వరకు భిన్నంగా వాతావరణ నమూనాల అంచనాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది బలపడి వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశాలు ఉన్నట్లు పలు వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్ 11వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా, దీని ప్రభావంతో నవంబర్ 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారి నవంబర్ 17వ తేదీ నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. తీరం చేరేలోపు తుపానుగా బలపడే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.

తీరం దాటే ప్రాంతంపై భిన్న అంచనాలు

నవంబర్ 13 నుంచి 20వ తేదీ మధ్య ఈ వాతావరణ వ్యవస్థ తీరం దాటే అవకాశం ఉందని వివిధ నమూనాలు అంచనా వేస్తున్నప్పటికీ, ఏ ప్రాంతంలో తీరం దాటుతుందనే విషయంలో భిన్నమైన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. జీఎఫ్ఎస్, ఏఐజీఎఫ్ఎస్ నమూనాలు బంగ్లాదేశ్ వైపు సూచిస్తుండగా, ఈసీఎంఎఫ్ నమూనా నెల్లూరు తీరాన్ని, ఈసీఎంఏఐ నమూనా ఒంగోలు ప్రాంతాన్ని, జీఈఎం నమూనా మచిలీపట్నం ప్రాంతాన్ని సూచిస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి తుపాను దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై స్పష్టత లేదు. రానున్న రెండు రోజుల్లో వాతావరణ నమూనాల తాజా అంచనాలతో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నవంబర్ 23న మరో అల్పపీడనం

ఇదిలా ఉండగా నవంబర్ 23వ తేదీ సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఒకవైపు ప్రస్తుత అల్పపీడనం తుపానుగా మారే అవకాశాలపై అంచనాలు కొనసాగుతుండగా, మరోవైపు నెలాఖరులో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు వాతావరణ పరిస్థితులపై ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రాథమిక నమూనాల అంచనాలు మాత్రమేనని, తుపాను ఏర్పడటం, దాని తీవ్రత, ప్రయాణ దిశ, తీరం దాటే ప్రాంతంపై అధికారిక వాతావరణ శాఖ ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని గమనించాలి. ప్రజలు ఎప్పటికప్పుడు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.