BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:41 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పెళ్లైన నాలుగు రోజులకే రూ.18 లక్షల నగలు, నగదుతో వధువు పరార్!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
10 Nov, 2026 - 04:41 PM
24 వీక్షణలు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘటన.. పోలీసులను ఆశ్రయించిన వరుడి కుటుంబ సభ్యులు

బిలాస్‌పుర్ (ఎన్ టుడే న్యూస్):

పెళ్లైన నాలుగు రోజులకే ఓ వధువు రూ.18 లక్షల విలువైన నగలు, నగదుతో కనిపించకుండా పోయిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్ జిల్లా భరారీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో వరుడు, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 22 ఏళ్ల మహిళను అక్టోబర్ 31న జగాధ్రీ సివిల్ కోర్టులో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం వధువును తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు వరుడి కుటుంబ సభ్యులు గుర్తించారు.

ఈ క్రమంలో ఇంట్లో ఉన్న సుమారు రూ.18 లక్షల విలువైన నగలు, నగదు కనిపించకపోవడంతో వధువు వాటిని తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో వారు షాక్‌కు గురయ్యారు.

వధువు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వధువు వెళ్లిపోవడం, విలువైన నగలు, నగదు కనిపించకపోవడంతో వరుడు, అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వధువు ఆచూకీ, పోలీసుల దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.