BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 05:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జాతీయ కుటుంబ లబ్ధి పథకం పునరుద్ధరణ..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 05:00 PM
34 వీక్షణలు

కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేల సాయం 18 నుంచి 60 ఏళ్లలోపు కుటుంబ పెద్ద మరణిస్తే నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసా కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తి మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవనుంది. ఇందుకోసం జాతీయ కుటుంబ లబ్ధి పథకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరణించిన కుటుంబ పెద్ద వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన సమయంలో ఈ ఆర్థిక సాయం కొంతమేర ఉపశమనం కలిగించనుంది. పథకం పునరుద్ధరణతో అర్హులైన పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే అవకాశం ఏర్పడింది.